APని గ్లోబల్ మ్యాప్‌పై నిలబెడతాం: కిడారి
NEWS Oct 04,2025 08:32 pm
పాడేరు: ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ అధ్యక్షుడు, జిసిసి చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు. పాడేరులో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పరిశ్రమల ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ అభివృద్ధి ప్రయత్నాలను అడ్డుకోవడమే వైసీపీ విధానమని ఆయన విమర్శించారు.