డిపోను ఆన్‌లైన్ చేయాలంటూ డిమాండ్
NEWS Oct 04,2025 02:59 pm
జి.మాడుగుల: ప్రజలకు నిత్యావసరాలు అందించే డి.ఆర్. డిపోలను ఆన్‌లైన్‌లోకి తేవాలని లువ్వసింగి మాజీ వైస్‌ప్రెసిడెంట్ రీమలి కొండబాబు డిమాండ్ చేశారు. పంచాయతీ కేంద్రంలో ఉన్న డిపోను మినహాయించి చుట్టుపక్కల డిపోలను ఆన్‌లైన్ చేసినా, పంచాయతీ కేంద్ర డిపోను మాత్రం ఆన్‌లైన్ చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. లువ్వసింగి గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ పూర్తిగా అందుబాటులో ఉన్నందున ఇక్కడి డిపోను వెంటనే ఆన్‌లైన్ చేయాలని ఆయన కోరారు.