రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా గిల్
NEWS Oct 04,2025 05:10 pm
అక్టోబరు 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్, టీ20 సిరీస్‌ల కోసం కోసం టీమిండియా జట్లను ప్రకటించారు. రోహిత్ శర్మ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించారు. ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఆల్ రౌండర్ కోటాలో తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. భారత వన్డే జట్టు- శుభ్ మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారత టీ20 జట్టు - సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.