ఆటో డ్రైవర్ లుక్‌లో సీఎం చంద్రబాబు
NEWS Oct 04,2025 04:42 pm
AP: CM చంద్రబాబు నిత్యం ఒకే కలర్ ప్యాంట్, చొక్కానే ధరిస్తారు. వేరే దుస్తుల్లో కనిపించడం అరుదు. ఎప్పుడో ఒకసారి పండగల సమయంలో పంచెలో కనిపిస్తుంటారు. ఇవాళ ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో సీఎం కొత్త లుక్ ఆకట్టుకుంది. ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకొని ఆటోవాలాలు, టీడీపీ శ్రేణుల్లో ఆయన జోష్ నింపారు. దీంతో CBN ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్, లోకేశ్ కూడా ఆటో డ్రైవర్ చొక్కాలు ధరించారు.