సద్దుల బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన
NEWS Oct 04,2025 04:36 pm
మెట్‌పల్లి: సద్దుల బతుకమ్మ నిమజ్జనం నేపథ్యంలో పట్టణంలోని బతుకమ్మ ఘాట్లను మున్సిపల్ కమిషనర్ మోహన్, సిఐ అనిల్ సంయుక్తంగా పరిశీలించారు. వట్టి వాగు వద్ద ఉన్న బతుకమ్మ ఘాటు, చెరువు దగ్గర కెనాల్ ఘాటు, రేగుంటలో వెంకట్రావుపేట బతుకమ్మ ఘాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ కేడ్లు, లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. శుభ్రత, భద్రత, రాకపోకలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్, డిఈ నాగేశ్వరరావు, టిపిఓ రాజేంద్రప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్‌కుమార్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.