బాక్సాఫీస్ అద్దిరిపోతోంది
NEWS Oct 04,2025 11:46 am
రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాంతార ఛాప్టర్-1’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందన లభిస్తోంది. రిలీజ్ అయిన రెండో రోజుకే ఈ సినిమా రూ.45 కోట్ల (నెట్) వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. అన్ని షోలలో సగటున 82.31% ఆక్యుపెన్సీతో దూసుకుపోతోందని సమాచారం. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ.106.85 కోట్ల (నెట్) భారీ వసూళ్లు సాధించి సంచలనాన్ని సృష్టించింది. ఈ వేగం కొనసాగితే, వీకెండ్ ముగిసేలోపు ‘కాంతార ఛాప్టర్-1’ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.