రష్మిక-విజయ్ నిశ్చితార్థం!
NEWS Oct 03,2025 11:49 pm
HYD: కొంతకాలంగా ప్రేమబంధంలో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో శుక్రవారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్టు విజయ్ సన్నిహితవర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ శుభవార్తపై విజయ్‌గానీ, రష్మికగానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.