‘కాంతార 1’పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
NEWS Oct 03,2025 09:34 pm
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ‘కాంతార ఛాప్టర్ 1’ చిత్రంపై స్పందించాడు. “నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్ కోసం రిషబ్ శెట్టి, అతని బృందం పెట్టిన ఊహకందని కష్టం చూశాక భారతీయ ఫిల్మ్ మేకర్స్ అంతా సిగ్గుపడాలి. “రిషబ్ శెట్టి.. నువ్వు గొప్ప నటుడివో లేక గొప్ప దర్శకుడివో నేను తేల్చుకోలేకపోతున్నాను” అంటూ ఆయన పనితీరును ఆర్జీవీ మెచ్చుకున్నారు. ఈ మేరకు వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.