తాగిన మైకంలో చెరువులో పడి వ్యక్తి మృతి
NEWS Oct 03,2025 09:36 pm
ఇబ్రహీంపట్నం: ఆంధ్రా నుంచి వచ్చి ఎర్దండిలో నివసిస్తున్న వాకమల్ల వెంకటేష్ (33) మద్యం సేవించి చెరువులో పడి మృతి చెందాడు. గత నెల 30న మద్యం కోసం భార్య రాజమణిని డబ్బు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం గ్రామ శివారులోని చెరువులో అతని మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అనిల్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని బయటకు తీశారు. తాగిన మైకంలో పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని, ఎవరిపైనా అనుమానం లేవని భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.