ఏపీ కేబినెట్ సమావేశంలొ కీలక నిర్ణయాలు
NEWS Oct 03,2025 09:16 pm
AP అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఇందులో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం, అమరావతి అభివృద్ధి పనుల వేగవంతానికి ఎస్‌పీవీ ఏర్పాటు, రాజధానిలో మిగిలిన భూముల సేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, టెక్ హబ్‌ల ఏర్పాటుకు 'లిఫ్ట్' పాలసీకి అనుబంధ ప్రతిపాదనల ఆమోదం, ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రులకు దిశానిర్దేశం, రాష్ట్రంలో కారవాన్ టూరిజం పథకానికి మంత్రివర్గం ఆమోదం.. వంటి నిర్ణయాలు ఉన్నాయి.