స్వగ్రామ దసర వేడుకల్లో కలెక్టర్ అనుదీప్
NEWS Oct 03,2025 08:49 pm
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దసరా సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి వచ్చారు. గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు ఆయనను కలుసుకొని జమ్మి ఆకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. యువతను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ “సెల్‌ఫోన్లు, దురలవాట్లకు బానిసలవ్వకండి. చదువుపట్ల దృష్టి పెట్టండి. చదువే మనల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది” అని పిలుపు నిచ్చారు. గ్రామంలో దుర్గామాత శోభాయాత్రలో పాల్గొని పూజలు నిర్వహించిన ఆయనకు అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు.