ఇబ్రహీంపట్నంలో మహిళ ఆత్మహత్య
NEWS Oct 03,2025 03:17 pm
ఇబ్రహీంపట్నం: ఎర్థండి గ్రామానికి చెందిన గంగోత్రి (అల్లెపు సంతోష్ భార్య) ఆత్మహత్య చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా భర్తతో కలిసి తల్లి ఇంటికి వచ్చిన గంగోత్రి, భోజనం సమయంలో దంపతుల మధ్య తగవు జరిగింది. అనంతరం భర్త ఇంటికి తిరిగి వచ్చిన ఆమె మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తహసిల్దార్ పర్యవేక్షణలో శవ పంచనామం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.