జీఎస్టీపై సూపర్ సేవింగ్స్ అవగాహన
NEWS Oct 03,2025 09:11 pm
బుచ్చయ్యపేట: లోపూడి, ఎల్‌బీపీ అగ్రహారం గ్రామ రైతు భరోసా కేంద్రంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పథకంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. వస్తువులపై తగ్గిన పన్ను రేట్లు, వాటి ప్రయోజనాలను వివరించారు. అగ్రికల్చర్ అధికారులు రమణ బాబు, వరహాల బాబు, పంచాయతీ కార్యదర్శి వెంకట పద్మ, రెవెన్యూ అధికారి సుధాకర్, సర్పంచ్ మొల్లి శ్రీను, ఎంపిటిసి ఎల్లపు జగ్గారావు, మహిళా పోలీసు నాగరత్నం, ఏఎన్ఎం గౌరీ, రాణి, వివోఏ రోహిణి, వీఆర్పి సత్యనారాయణ, అన్నయ్య బాబు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.