దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం
NEWS Oct 03,2025 01:45 pm
కర్నూలు: దేవరగట్టు బన్నీ ఉత్సవం సందర్భంగా జరిగిన కర్రల సమరం విషాదానికి దారితీసింది. ఉత్సవంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 78 మందికి పైగా గాయపడ్డారు. మృతులు అరికెరికి చెందిన తిమ్మప్ప, కర్ణాటక రాష్ట్రానికి చెందిన బసవరాజు గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులను ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్సవం ఉత్సాహంగా జరగాల్సిన సమయంలో ప్రాణ నష్టం జరగడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.