ఘనంగా జరుగుతున్న 'అలయ్ బలయ్'
NEWS Oct 03,2025 05:49 am
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ సమ్మేళనం జరుగుతోంది. దసరా మరుసటి రోజున నిర్వహిస్తున్న ఈ వేడుకకు సీఎంలు, కేంద్రమంత్రులు, మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. 86 వెరైటీ వంటకాలు ఏర్పాటు చేశారు. సోదర భావాన్ని పెంపొందించే వేడుక, సామాజికి విలువలు పెంపొందించేందుకు అలయ్ బలయ్ ఉపయోగపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.