కర్నూలు: హొళగుంద(M) దేవరగట్టులో కర్రల సమరం జరిగింది. ఏటా దసరా రోజు బన్ని ఉత్సవంలో భాగంగా అర్ధరాత్రి 12గంటలకు మాళమ్మ మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగించే సమయంలో వాటిని దక్కించుకోవడానికి ఇరు వర్గాలు పోటీపడ్డారు. ఈ ఉత్సవంలో హింస చెలరేగకుండా 800మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు అమర్చారు. 50 పడకల తాత్కాలిక వైద్య శిబిరాన్ని సిద్ధం చేశారు. హింసకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.