TG: తన స్వగ్రామమైన నాగర్ కర్నూల్(D) కొండారెడ్డిపల్లిలో దసరా పండుగను జరుపుకున్న సీఎం రేవంత్ కొడంగల్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేస్తున్నారు. అంతకుముందు కొండారెడ్డిపల్లిలో కోట మైసమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి జమ్మిచెట్టు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.