ఘనంగా అశోక విజయదశమి వేడుక
NEWS Oct 02,2025 11:44 pm
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామంలో A.Y.S ఆధ్వర్యంలో అశోక విజయదశమి ఉత్సవాలను అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా BSP సీనియర్ నాయకుడు గుజ్జరి ప్రకాష్ మాట్లాడుతూ, “బుద్ధుని ధర్మ బోధన, అశోకుని ధర్మపాలన, అంబేద్కర్ ధర్మ దీక్ష — ఈ మూడు కలయికే అశోక విజయదశమి” అని పేర్కొన్నారు. నరేష్, సురేష్, తిరుమలేష్, శ్రీధర్, రాకేష్, శ్రీను, శేఖర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.