అమ్మవారి లడ్డు ₹ 1 లక్ష 5 వేలు
NEWS Oct 02,2025 11:42 pm
మాదాపూర్: నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి లడ్డు ప్రసాదం వేలం పాటలో రూ. 1,05000కు చేరింది. ఈ లడ్డును గరిపెల్లి శ్రీధర్ కుటుంబం గెలుచుకున్నారు. ఇంత ఎక్కువ మొత్తంలో లడ్డు వేలం కావడంతో సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో, అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.