అనంతగిరి: బుధవారం నుండి గురువారం వరకు కురిసిన గాలివానలతో పాటు భారీ వర్షాలకు అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మాడ్రెబు కొండాతాబేలు గ్రామానికి చెందిన ఆనంద్ అనే గిరిజనుడి సిమెంట్ రేకుల ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే నివాసం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నారు.