ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా వేడుకలు
NEWS Oct 02,2025 03:19 pm
విజయవాడ: విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులను అనుమతించారు. వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు దుర్గగుడి ఈవో. ఇంద్రకీల్రాదిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం ఈ ఏడాది రద్దు అయింది.