వేంపేటలో మన ఊరు మన ఏటీఎం
NEWS Oct 02,2025 03:23 pm
వేంపేట గ్రామంలో ‘మన ఊరు – మన ఏటీఎం’ కేంద్రాన్ని జువ్వాడ కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రోప్రైటర్ శ్రీరాముల ప్రతీప్‌కి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులు ఇకపై ఏటీఎం కార్డు ద్వారా మాత్రమే కాకుండా అన్ని UPI యాప్స్ — గూగుల్ పే, ఫోన్ పే మొదలైన వాటి స్కానర్ ద్వారా కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం పొందగలరని తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అల్లూరి మహేందర్ రెడ్డి, రాము, పల్లి శేఖర్, కొమ్ముల రాజేశ్వర్ రెడ్డి, అల్లూరి సుకుమార్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ముస్కు శంకర్ రెడ్డి, బద్దం స్వామి రెడ్డి, తుమ్మల లింగారెడ్డి, నల్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.