స్థానిక ఎన్నికలు - తీర్పుపై ఉత్కంఠ
NEWS Oct 02,2025 08:16 am
TG: స్థానిక ఎన్నికలపై ఈనెల 8న హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. BC రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన GO-9ని సమర్థిస్తుందా? లేక నిలిపివేస్తుందా? అన్న టెన్షన్ నెలకొంది. జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే చట్టం ప్రకారం BCలకు వచ్చే 22% రిజర్వేషన్లు పోను పార్టీ పరంగా మరో 20% ఇవ్వాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. తీర్పు ఎలా ఉన్నా ఎన్నికలపై ముందుకే వెళ్లనున్నట్లు తెలుస్తోంది.