మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత
NEWS Oct 02,2025 12:49 am
TG: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దామోదర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నెల 4న తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.