వెంకటేశ్వర స్వామి రథోత్సవం
NEWS Oct 01,2025 04:15 pm
కథలాపూర్: మండల కేంద్రంలో ఘనంగా శ్రీ భూనీల గోదా వెంకటేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులు రథోత్సవం ముందు నృత్యాలు చేస్తూ గ్రామంలోని వీధివీధికి రథోత్సవం తీసుకెళ్లారు. పూజారి వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి దసరా ముందు రోజు గ్రామంలో రథోత్సవం నిర్వహిస్తామని, దీని ద్వారా ఆ శ్రీ భూనీల గోదావెంకటేశ్వర స్వామి గ్రామంలో చీడ పీడ నియంత్రణ తొలగిస్తారని గ్రామస్తుల నమ్మకం అని తెలిపారు . స్వామివారి ఆశీస్సులు గ్రామంపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రాజిరెడ్డి, శేఖర్, శీను గౌడ్, దత్తు పాల్గొన్నారు.