హనుమాన్ భగవద్వజం ఎగరవేయడం ఆచారం
NEWS Oct 01,2025 04:13 pm
కథలాపూర్: సిరికొండ గ్రామంలో దసరా పండుగ రోజున విజయచిహ్నం హనుమాన్ భగవత్ధ్వజం ఎగరవేయడం ప్రత్యేక ఆచార సంప్రదాయం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగ జరుపుకుంటారు. హనుమంతుడు బలం, ధైర్యం, సేవకు ప్రతీక. హనుమాన్ జెండా ఆ లక్షణాలను సూచిస్తుంది. అర్జునుని రథంపై హనుమంతుడి చిహ్నం ఉండడం విజయాన్ని తెలియజేస్తుంది. విజయదశమి రోజున సాయంత్రం గ్రామపంచాయతీ ఆవరణలో స్థానిక పురోహితులు పూజ చేసిన తరువాత పాత ధ్వజం తీసివేసి నూతన ధ్వజమును విశ్వబ్రాహ్మణ సోదరులు ఎగరవేస్తారు. అనంతరం పాత జెండాను ముక్కలుగా చేసి పైనుండి తీసి పొలిమేరకు తరలిస్తారు.