జంబి గద్దె పరిసరాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
NEWS Oct 01,2025 09:39 pm
మెట్ పల్లి: పట్టణంలో దసరా పండుగ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో స్టేజి, లైటింగ్, జంబి గద్దె పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాట్లను పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ మోహన్. లైటింగ్ అధికంగా పెట్టాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని జంబి గద్దె పరిసరాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ నాగేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, టీఎంసీ సోమిడీ శివ, సిస్టం ఆపరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.