విజయవాడలో రూ.2 కోట్ల గంజాయి స్వాధీనం
NEWS Oct 01,2025 04:01 pm
విజయవాడ: ఏపీలో గంజాయి రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతున్నా, అక్రమార్కులు మార్గాలు మార్చి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈగల్ టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా, తాజాగా డ్రగ్స్ కంట్రోల్ విభాగం (DRI) అధికారులు విజయం సాధించారు. విజయవాడలో సుమారు రూ.2 కోట్ల విలువ చేసే గంజాయి రవాణాను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు.