హైదరాబాద్: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. "పింక్ బుక్, రెడ్ బుక్, బ్లూ బుక్ ఏమి లేవు. మాకు తెలిసిందే ఒకటే.. ఖాకీ బుక్ మాత్రమే,” అని డీజీపీ వాఖ్యానించారు. “సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన పోస్టులు పెడితే... కఠిన చర్యలు తప్పవు,” అని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు.