ఫిలిప్పీన్స్ లో మరోసారి భారీ భూకంపం
NEWS Oct 01,2025 03:29 pm
మనీలా: ఫిలిప్పీన్స్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. మధ్య ఫిలిప్పీన్స్ లో 6.9 తీవ్రతతో బీభత్సం సృష్టించింది. ఈ భారీ భూకంపం సంభవించిన ఘటనలో 31 మంది మరణించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం DZMM రేడియో ద్వారా ఈ సమాచారం అందింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, దాదాపు 90,000 జనాభా కలిగిన తీరప్రాంత సిటీ బోగోకు దాదాపు 17 కిలోమీటర్ల ఈశాన్య దిశలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా పట్టణాలు, పలు గ్రామాలలో భారీ నష్టం జరిగింది.