నర్సీపట్నంలో దంచి కొడుతున్న వర్షం
NEWS Oct 01,2025 01:57 pm
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, పరిసర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం సమయంలో కుండపోతగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.