జైతవరం: జీఎస్టీపై అవగాహన సదస్సు
NEWS Oct 01,2025 01:57 pm
చీడికాడ మండలం జైతవరం గ్రామంలో జీఎస్టీపై అవగాహన సదస్సు జరిగింది. నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మందులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని పశువైద్య అధికారి డాక్టర్ ఏ.సి.హెచ్. గణేశ్వర్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ కోడూరు సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గ్రామస్తులు హాజరై ఆసక్తిగా విన్నారు. అధికారులు జీఎస్టీపై వివరాలు తెలియజేస్తూ, ప్రజల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.