అత్యంత ప్రధానమైనది మహర్నవమి
NEWS Oct 01,2025 10:14 am
దేవి శరన్నవరాత్రుల్లో మహర్నవమి అత్యంత ప్రధానమైనది. జగన్మాత ఆరాధనకు ఈరోజే ముఖ్యమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. నిర్ణయ సింధువు ప్రకారం.. నవరాత్రుల్లో అమ్మవారిని పూజించలేనివారు కనీసం ఈరోజైనా ఆరాధించాలి. దసరా రోజు చేసే పూజ ఉద్వాసన మాత్రమే. నవమి రోజు ప్రధాన పూజ చేసిన వారే దశమి నాడు మళ్లీ పూజ చేస్తారు. సకల శుభాలు, విజయాలు పొందాలంటే మహర్నవమి నాడు అమ్మవారిని తప్పక పూజించాలి.