రేపు చికెన్, మటన్, మద్యం బంద్
NEWS Oct 01,2025 10:07 am
రేపు దసరా పండగ. గాంధీ జయంతి కూడా రేపే రావడంతో మాంసం, మద్యం షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణలో దసరా అంటే ముక్క, చుక్క అని.. ఇది ఆనవాయితీగా వస్తోందని కొందరు చెబుతున్నారు. ఇవాళే చికెన్, మటన్, లిక్కర్ తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రామాల్లో సామూహికంగా మేకలు కట్ చేసి పాలు పంచుకునేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు మాంసం, లిక్కర్ షాప్స్ మూసివేయాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు.