ఘనంగా TDF USA బతుకమ్మ సంబురాలు
NEWS Sep 30,2025 06:57 pm
కాలిఫోర్నియా: TDF - USA ఆధ్వర్యంలో ఫ్రీమాంట్ సిటీలోని లేక్ ఎలిజబెత్ సెంట్రల్ పార్క్‌లో బతుకమ్మ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ ఎన్నారై వనితలు పాల్గొని బతుకమ్మలు ఆడారు. సముద్రా సిల్క్స్ వారు ఉత్తమ బతుకమ్మలకు గిఫ్ట్స్ అందజేశారు. ముఖ్య అతిథులుగా TDF ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి వట్టే పాల్గొన్నారు. నిర్వాహకులు స్రవంతి కరకాల, పల్లవి, సింధి, సంధ్య, సమత, లావణ్య, అనుపమ, ప్రీతితో పాటు ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ అతిథులకు, స్పాన్సర్స్ దోశ పాలస్, సముద్రా సిల్క్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.