బతుకమ్మ ఘాట్ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
NEWS Oct 01,2025 12:10 am
మెట్ పల్లి: స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వట్టి వాగు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్, మినీ ట్యాంక్ బండ్ వద్ద, పెద్ద కెనాల వద్ద, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. శనివారం బతుకమ్మ పండుగ పురస్కరించుకొని ముందస్తుగా పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. బతుకమ్మ పండుగ రోజు ఘాట్ల చుట్టూ భారీ కేడ్లు, అధిక లైటింగ్ ఏర్పాటు చేయాలని, సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.