బీడీ కాలనీలో వైభవంగా దుర్గాదేవి బోనాలు
NEWS Sep 30,2025 10:31 pm
మెట్‌పల్లి: బీడీ కాలనీలోని శ్రీ మహాలక్ష్మి దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పిస్తూ, డప్పు చప్పుళ్లు, మేల తాళాల నడుమ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.