చీకటిలో 3 గ్రామాలు – విద్యుత్ కోసం డిమాండ్
NEWS Sep 30,2025 10:29 pm
అల్లూరి జిల్లా, జీకే వీధి మండలం: ఏ.దారకొండ పంచాయితీ పరిధిలోని గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకాపల్లి గ్రామాలకు విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత కేబుల్ వైర్లతోనే లైన్ ఇచ్చిన కారణంగా ఆ వైర్లు పూర్తిగా చిరిగిపోయి, ముక్కలుగా తెగిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాత్రివేళ చీకటిలో నానా పాట్లు పడుతున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి దృష్ట్యా కొత్త కేబుల్ వైర్లు వేయాలని విద్యుత్ శాఖ తక్షణమే స్పందించాలని 3 ఊర్ల ప్రజలు డిమాండ్ చేశారు.