సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్. నిరంతరం ప్రజా సేవలో హైదరాబాద్ సిటీ పోలీసులు మీకు అందుబాటులో ఉంటారని అన్నారు. నగరవాసులు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి పౌరుడు కూడా పోలీస్ ఆఫీసరే అనే విషయాన్ని మరిచి పోవద్దన్నారు. ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉంటుందని ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. చట్టవ్యతిరేక కార్యాకలపాలను నిర్బయంగా తెలియ చేయాలని కోరారు.