కరూర్ తొక్కిసలాటలో నలుగురు అరెస్ట్
NEWS Sep 30,2025 07:14 pm
కరూర్ తొక్కిసలాట ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. టీవీకే పార్టీ జిల్లా కార్యదర్శి మథియాళన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించారు పార్టీ చీఫ్ విజయ్. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తానని ప్రకటించారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల చొప్పున ఇస్తానని ఇప్పటికే తెలిపారు. ఇదే సమయంలో అసలు వాస్తవాలు ఏమిటో త్వరలో తెలుస్తాయన్నారు.