నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ
NEWS Sep 30,2025 06:46 pm
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్బంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి, సమగ్ర అభివృద్ధిని సాధించడానికి తాము ప్లాన్ చేశామన్నారు.