బతుకమ్మ సంబురాలకు రండి
NEWS Sep 30,2025 06:28 pm
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ సంబురాలకు రావాలని కోరారు. మంత్రి వెంట రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి కూడా ఉన్నారు. ఈ సందర్బంగా తాను తప్పకుండా వస్తానని, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటానని తెలిపారు గవర్నర్.