బ్రహ్మోత్సవానికి పంచలోహ వాహనాల విరాళం
NEWS Sep 30,2025 09:16 pm
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామానికి చెందిన మంగిలి పెళ్లి మహిపాల్ ఉదార హృదయం చూపించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా రూ.2.50 లక్షల విలువ గల 5 పంచలోహ వాహనాలను ఆలయానికి విరాళంగా అందించారు. మహిపాల్ గతంలోనూ ఆర్థిక సహాయాలు అందించారు. కార్యక్రమానికి సహకరించి, మద్దతు అందించిన దొంతుల తుక్కరం, దోమకొండ చిన్న రాజన్నకు గ్రామాభివృద్ధి కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. మహిపాల్ సేవా స్పూర్తి యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.