సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దు
NEWS Sep 30,2025 06:04 pm
ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండక పోవచ్చని, తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండని హెచ్చరించారు. లీగల్‌గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి అని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతోందన్నారు.