వీడ్కోలు కార్యక్రమంలో డీజీపీ భావోద్వేగం
NEWS Sep 30,2025 05:59 pm
వీడ్కోలు కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు డీజీపీ జితేంద్ర. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది సర్కార్. ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉన్నానని అన్నారు. ఇటీవలే నా తల్లిని కోల్పోయానని వాపోయారు. విలువలు నేర్పించిన నా తల్లిదండ్రులు జీవించి లేరంటూ కన్నీటి పర్యంతం అయ్యారు డీజీపీ.