దేశాన్ని గెలిపించాలనే ఆడాను
NEWS Sep 30,2025 05:40 pm
దేశాన్ని గెలిపించాలనే ఉద్దేశంతోనే తాను ఆడానని అన్నారు క్రికెటర్ తిలక్ వర్మ. పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడికి గురయ్యామన్నాడు. ఆ సమయంలో భావోద్వేగానికి లోనైతే అయితే ఆటను ఆడలేం అన్నాడు. నా ముందు భారత దేశం తప్ప ఇంకేదీ కనిపించ లేదన్నాడు. ఫైనల్ మ్యాచ్ లో వర్మ 69 రన్స్ చేశాడు. అజేయంగా నిలిచాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.