ఎన్నికల కోడ్ అమలుతో తనిఖీలు: ఎస్సై అనిల్
NEWS Sep 30,2025 04:29 pm
ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద నేటి నుండి ఇబ్రహీంపట్నం పోలీసుల పర్యవేక్షణలో వాహన తనిఖీలు ప్రారంభించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు లేదా మద్యం రవాణా చేస్తే, అటువంటి డబ్బు లేదా మద్యం స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తామని ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు.