షెడ్డు నిర్మాణానికి విరాళం అందించండి
NEWS Sep 30,2025 05:21 pm
సిరికొండ: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను సిరికొండ మున్నూరు కాపు సంఘ సభ్యులు కలిసి మున్నూరుకాపు ఫంక్షన్ హల్‌కు అదనపు షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధులు మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మండల అధ్యక్షులు మల్యాల మారుతి, బద్రి సత్యం, ప్రతాప్, అనీల్, సంఘం అధ్యక్షులు చుక్క మురళి, సభ్యులు చుక్క అశోక్, నీలి భూమారెడ్డి, చుక్క గంగాధర్, తోట బక్కన్న, చుక్క లింగం తదితరులు పాల్గొన్నారు.