అమ్మవారి ప్రసాద వితరణ
NEWS Sep 30,2025 11:43 am
కథలాపూర్ మండల కేంద్రంలో గణేష్ భవాని మిత్రమండలి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకు కృపయారు. అమ్మవారి మహా యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపూరెడ్డి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు, గణేష్ భవాని మిత్ర మండలి వ్యవస్థాపకులు వర్ధినేని నాగేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కల్లెడా శంకర్ ,మామిడిపల్లి రాకేష్, చిలుక అశోక్, సూర్య, సతీష్, రాజేష్, గణేష్ భవాని మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.