గర్భిణీలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి: డా. శృతి
NEWS Sep 30,2025 05:11 pm
గర్భిణీలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషకాహారం తీసుకోవాలని డాక్టర్ శృతి తెలియజేశారు. తిరుపాక మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు తగినంత నీరు తాగాలనీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. విశ్రాంతి తీసుకుంటూ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. గర్భధారణ సమయంలో ఏర్పడే ఏవైనా సమస్యలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.